

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్సభ పార్లమెంటరీ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తూ, పార్టీని ప్రతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకునే ఏ రెబల్ వర్గానికీ గుర్తింపు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఒకే రాజకీయ పార్టీ అని, పార్టీకి ఒకే పార్లమెంటరీ నాయకుడు, ఒకే అధికారిక విప్ ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఎంపీల బృందం స్వతంత్రంగా విడిపోయి ప్రత్యేక వర్గంగా గుర్తింపు కోరడం చట్టబద్ధం కాదని పేర్కొన్నారు.
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. శివసేన చీలిక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన అభిషేక్, శాసనసభ లేదా పార్లమెంటరీ చీలికలకు ప్రస్తుతం చట్టపరమైన రక్షణ లేదని వాదించారు. దీంతో టీఎంసీ అంతర్గత రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు లోక్సభ స్పీకర్ తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!