

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలోని మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి వృద్ధి కనిపిస్తున్నట్లు సమాచారం.
ఒక్కరోజులోనే టికెట్ల అమ్మకాలు సుమారు 50 వేల నుంచి 86 వేలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్క రోజులో దాదాపు 36 వేల టికెట్లు అదనంగా అమ్ముడయ్యాయి. లాస్ ఏంజిల్స్ ప్రీమియర్‌కు లభించిన స్పందన కూడా అడ్వాన్స్ బుకింగ్స్ పెరగడానికి దోహదపడిందని సమాచారం. ఇదే జోరు కొనసాగితే టికెట్ల అమ్మకాలు త్వరలోనే లక్ష మార్కును దాటే అవకాశం ఉంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!