

వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమా ప్రేమికులకు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఎంటర్టైనర్ నుంచి హాలీవుడ్ హర్రర్ సినిమాల వరకు ఈ వారం పలు భాషల్లో ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, హర్రర్ ఇలా అన్ని జానర్ల అభిమానులకు సరిపడే కంటెంట్ ఈ జాబితాలో ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు ఈ నెల 11 న జీ5 లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. నవీన్ పొలిశెట్టి కామెడీతో అలరించిన అనగనగా ఒక రాజు అదే రోజున నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానుంది. శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ డ్రామా సంప్రదాయినీ సుప్పిణి సుద్దపూసని ఈ నెల 12 న ఈటీవీ విన్లో విడుదల కానుంది.
హిందీ క్రైమ్ థ్రిల్లర్ కోహ్రా సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో ఈ నెల 11 న అందుబాటులోకి రానుంది. నివిన్ పౌలీ నటించిన మిస్టరీ థ్రిల్లర్ బేబీ గర్ల్ సోనీ లివ్‌లో ఈ నెల 12 న స్ట్రీమ్ అవుతుంది. హాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే ప్రిడేటర్స్: బ్యాడ్‌లాండ్స్ ఈ నెల 12 న, ది కంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్ ఈ నెల 13 న జియో హాట్‌స్టార్‌లో విడుదల కానున్నాయి. అలాగే ఈటీవీ విన్లో గోల్డ్ & గీత షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!