

బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటించిన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా “సుమతీ శతకం” ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 6 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం రేపటి నుంచి నుంచి డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా అమర్దీప్ నటనతో పాటు గ్రామీణ నేపథ్యంలోని కామెడీ కొందరిని ఆకట్టుకుంది. అయితే కథనం సాధారణంగా ఉండటంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.
ఈ చిత్రంలో శైలీ ఎం. చౌదరి హీరోయిన్గా నటించగా, టేస్టీ తేజ, మహేష్ విట్టా, జేడీవీ ప్రసాద్ మరియు మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో కనిపించారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. పెళ్లి కోసం ప్రయత్నించే ఒక యువకుడి చుట్టూ తిరిగే వినోదాత్మక కథతో ఈ సినిమా తెరకెక్కింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!