

2026 మొన్నే వచ్చినట్లుంది. కానీ అప్పుడే ఫిబ్రవరి చివరకొచ్చేసింది. ఈ వారం థియేటర్లలో వినోదం కోసం పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. శ్రీ విష్ణు నటించిన కామెడీ చిత్రం విష్ణు విన్యాసం విడుదల కానుంది. అలాగే కమెడియన్ మహేష్ విట్టా నటించిన "ఉత్తుత్త హీరోలు", "సన్నాఫ్ చిత్రాలు" కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హిందీలో ద కేరళ స్టోరీ 2 ఈ వీకెండ్లో రిలీజ్ అవుతోంది.
ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా ఆసక్తికరమైన కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. నవీన్ చంద్ర నటించిన హనీ, అలాగే తెలుగు డబ్బింగ్ చిత్రం అక్యూజ్డ్ స్ట్రీమింగ్ కానున్నాయి. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు, రోస్లిన్ వంటి తెలుగు సిరీస్‌లు కూడా విడుదల అవుతున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. మరి ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఏం వస్తుందో చూసేద్దాం.
ఈ వారం ఓటీటీ రిలీజులు (ఫిబ్రవరి 23 – మార్చి 1):
నెట్‌ఫ్లిక్స్
అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 27
అమెజాన్ ప్రైమ్ వీడియో
ద సీఈఓ క్లబ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 23
పాల్ మెక్కర్ట్నే (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 25
ద బ్లఫ్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 25
ఇక్కీస్ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 26
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 23
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 26
సంగ్ మర్మర్ (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 26
రోస్లిన్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 27
బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 28
బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 28
జీ5
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 27
తడయమ్ (తమిళ సిరీస్) – ఫిబ్రవరి 27
క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) – ఫిబ్రవరి 27
అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) – ఫిబ్రవరి 28
ఆహా
సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో) – ఫిబ్రవరి 27
సన్ నెక్స్ట్
హనీ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 27
నీలి హక్కీ (కన్నడ మూవీ) – ఫిబ్రవరి 27
ఎమ్ఎక్స్ ప్లేయర్
సైకో సయ్యాన్ (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 25
ఆపిల్ టీవీ ప్లస్
మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 27








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!