
ఓటీటీ

మేము కాప్‌లం వెబ్ సిరీస్ కామెడీ, మిస్టరీ అంశాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5 ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ నెల
22 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో వినోదం, వ్యంగ్యం, మిస్టరీ అంశాలను మేళవిస్తూ ప్రేక్షకులను అలరించేలా ట్రైలర్ రూపొందించారు.
మహదేవపట్నం అనే గ్రామంలో “సలార్ రాజు” అనే పందెం కోడి కనిపించకుండా పోవడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఈ కేసును విచారించేందుకు వచ్చిన ఇద్దరు అమాయక పోలీసుల పాత్రల్లో గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల నవ్వులు పూయించనున్నారు. విచారణలో భాగంగా గ్రామంలోని రహస్యాలు, స్థానిక రాజకీయాలు, ఊహించని సంఘటనలు బయటపడతాయి. నాగేంద్రబాబు కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్ వినోదంతో పాటు థ్రిల్లింగ్ అనుభూతిని అందించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!