

ఓటీటీ ప్రభావం పెరిగిన తర్వాత కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యువత, అమ్మాయిలలో ఈ కంటెంట్‌పై ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొరియన్ నేపథ్యంతో రూపొందిన తమిళ చిత్రం మేడిన్ కొరియా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘ఓజీ’ ఫేమ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించింది.
ఈ చిత్రాన్ని ఓటీటీ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వచ్చే నెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. చిన్నప్పటి నుంచి కొరియా అంటే ఇష్టం ఉన్న ఓ అమ్మాయి, పెద్దయ్యాక ఆ దేశానికి వెళ్లిన తర్వాత ఎదుర్కొన్న అనుభవాలే కథగా తెలుస్తోంది. టీజర్ ఇప్పటికే విడుదల కాగా, ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ వారం ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రానున్నాయి. నవీన్ చంద్ర నటించిన హనీ, అక్యూజ్డ్ వంటి డబ్బింగ్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని సర్ప్రైజ్ రిలీజ్లు ఉండొచ్చని టాక్.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!