

తెలుగులో ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగశౌర్య గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘చలో’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఆయన, 2023లో వచ్చిన ‘రంగబలి’ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు దాదాపు మూడుేళ్ల గ్యాప్ తర్వాత చేసిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రం థియేటర్లలో పెద్దగా హడావిడి లేకుండానే విడుదలై, ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. చాలా మందికి ఈ సినిమా విడుదలైన విషయమే తెలియకపోవడం విశేషం.
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ కథ విషయానికొస్తే.. వైజాగ్‌కు చెందిన కార్తీక్ తన అక్క కస్తూరిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. భూకబ్జాలపై పోరాడే లాయర్‌గా ఉన్న ఆమెపై దాడి జరగడంతో కార్తీక్ రాయలసీమకు వెళ్తాడు. అక్కడ గోవిందప్ప, వరదారెడ్డి మధ్య వైరం, వరుస హత్యలు, కుటుంబ బంధాలు, ప్రేమకథ చుట్టూ కథ తిరుగుతుంది. యాక్షన్, ఎమోషన్, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!