

థియేటర్లలో విడుదలైన చిన్న, మధ్యస్థాయి సినిమాలు వరుసగా ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ వారం సతీ లీలావతి, గాయపడ్డ సింహం, సిస్టమ్, లవ్ యూ రా, 14, రాజుగాని సవాల్, మధువిధు, టీఎన్ 2026 వంటి సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తమిళ స్టార్ ధనుష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ కర త్వరలోనే ఓటీటీలోకి రానుంది. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో, మమిత బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గత నెల 30న విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దొంగతనం సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ మిగతా భాగం సాధారణంగానే అనిపించింది. ఈ చిత్రం ఈ నెల 28 నుంచి నెట్‌ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
'కారా’ కథ విషయానికి వస్తే, కరస్వామి (ధనుష్) ఒక దొంగ. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమిత బైజు) కోసం తన పాత జీవితాన్ని వదిలి కొత్తగా ప్రారంభించాలనుకుంటాడు. హోటల్ వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశంతో బ్యాంకులో భూమి పత్రాలు తాకట్టు పెట్టాలని భావిస్తాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో తండ్రిని కోల్పోయి మళ్లీ దొంగతనాల వైపు మళ్లిపోతాడు. ఒకే బ్యాంక్‌కు చెందిన బ్రాంచ్‌లలో దొంగతనాలు చేస్తూ ముందుకు సాగుతాడు. అతను ఇలా చేయడానికి కారణమేంటి? చివరకు పోలీసులకు చిక్కుతాడా లేదా అన్నది కథలో కీలకం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!