

హీరోయిన్ ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు అమిగోస్, నా సామిరంగ, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి సినిమాల ద్వారా పరిచయమైంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె అక్కడ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నెల ప్రారంభంలో ఆమె స్వభాషలో విడుదలైన సినిమా ‘గత వైభవం’ ను తెలుగులోకి డబ్బింగ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
గతజన్మల ప్రేమ కథ నేపథ్యంతో తెరకెక్కిన ‘గత వైభవం’ సినిమా ఈ నెల (జనవరి)1 న తెలుగు థియేటర్లలో విడుదలైంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ, ఈ చిత్రం కంటెంట్ పరంగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించకపోయినా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, దుష్యంత్ ప్రధాన పాత్రల్లో నటించగా, సునీ దర్శకత్వం వహించారు.
కథ విషయానికి వస్తే, ఆధునిక(ఆషికా రంగనాథ్)కి పెయింటింగ్స్ వేయడం అలవాటు. తన ఊహల్లో వచ్చే ఓ వ్యక్తి చిత్రాన్ని గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సరిగ్గా అదే పోలికలతో ఉన్న పురాతన్ (దుష్యంత్) ఈమెకు ఎదురుపడతాడు. విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో నడిపే పురాతన్.. తొలుత ఆధునికకు తప్పుడు ఉద్దేశంతో దగ్గరవ్వాలని చూస్తాడు గానీ తన గత జన్మల గురించి ఆమె చెప్పే నిజాలు ఇతడిని షాక్‌కి గురిచేస్తాయి. ఆధునికకు అసలు గత జన్మల గురించి ఎలా తెలుసు? వందల ఏళ్లక్రితం వీళ్లిద్దరి మధ్య బంధమేంటి? అనేదే మిగతా స్టోరీ.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!