

దేశంలోనే అత్యాధునిక మెట్రో రవాణా వ్యవస్థ అయిన హైదరాబాద్ మెట్రో రైలులో మహిళా ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేస్తూ, సామాజిక సాధికారతకు బలమైన ఉదాహరణగా నిలుస్తూ 20 మంది ట్రాన్స్జెండర్ సిబ్బందిని భద్రతా విభాగంలో నియమించింది. తెలంగాణ ప్రభుత్వం సమానత్వం, గౌరవం, సమాన అవకాశాల దృక్కోణంతో చేపట్టిన ఈ చొరవలో భాగంగా ప్రత్యేక శిక్షణ పూర్తి చేసిన ఈ సిబ్బంది, డిసెంబర్ 1 2025 నుండి ఎంపిక చేసిన స్టేషన్లలో విధులు ప్రారంభించారు.
కొత్తగా నియమితులైన ట్రాన్స్జెండర్ సిబ్బంది జనరల్ మరియు మహిళల కోచ్లలో భద్రతా చర్యలు, స్కానర్ పర్యవేక్షణ, ప్రయాణికులకు దిశానిర్దేశం, సమాచారం, సహాయం అందించడం, స్ట్రీట్-లెవెల్ మరియు కాన్కోర్స్ భద్రతలో పాల్గొనడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు (వీరిలో 30 శాతం మహిళలు) ఉపయోగించే మెట్రోలో ఈ నియామకం మహిళల భద్రతా వాతావరణాన్ని మరింత దృఢపరుస్తూ, ట్రాన్స్జెండర్ సాధికారతకు శక్తివంతమైన సంకేతంగా నిలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!