

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఐదు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఢిల్లీలో జరిగిన ప్రెస్మీట్లో ప్రకటించింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కేరళ మరియు పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో ఏప్రిల్ 23 మరియు 29న పోలింగ్ జరుగుతుంది. అసోంలో కూడా ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు. మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా, ఐదు రాష్ట్రాల్లో 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో 1200 మందికి మించకుండా ఓటర్లను నమోదు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈసీ పేర్కొంది. అలాగే యువ ఓటర్లలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.





.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!