

తమిళ సినిమా ‘యూత్’ ఫ్రెషర్స్ మీట్ హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఉత్సాహంగా జరిగింది. కెన్ కరుణాస్, అనిష్మా అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంకటరాముడు, ప్రియాంశి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను హౌస్‌ఫుల్ వినీత్, సందీప్‌లు ఈటూసీ బ్యానర్‌పై తెలుగులో విడుదల చేస్తున్నారు. కెన్ కరుణాస్ మరియు టీమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 26 న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. “కమ్ విత్ యువర్ గ్యాంగ్, నో ఏజ్ లిమిట్” అనే స్లోగన్‌తో ప్రచారం కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో పలువురు దర్శకులు, నటులు సినిమా కంటెంట్, సంగీతం, యూత్ అంశాలపై ప్రశంసలు తెలిపారు. ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందన పొందడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. యథార్థ జీవితానికి దగ్గరగా ఉండే కథతో పూర్తి వినోదాన్ని అందించే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని చిత్ర యూనిట్ కోరింది.



















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!