
జనరల్

నటుడు యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ మరోసారి వాయిదా పడింది. జూన్ 4న విడుదలకు షెడ్యూల్ అయిన ఈ చిత్రం ఆ తేదీన విడుదల కాదని యశ్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం ఓవర్సీస్ హక్కుల ప్రక్రియ కొనసాగుతోందని యశ్ వెల్లడించారు. సినిమాకాన్‌లో వచ్చిన స్పందన తమ నమ్మకాన్ని పెంచిందని చెప్పారు. మొదట మార్చి 19న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రం పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా జూన్ 4కు వాయిదా పడింది. ఇప్పుడు గ్లోబల్ రిలీజ్ కోసం మరోసారి వాయిదా వేయగా, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!