

భారత సినిమా తండ్రి దాదాసాహెబ్ ఫాల్కే జీవితంపై బయోపిక్ రూపొందించాలనే ఆలోచనతో ఎస్.ఎస్. రాజమౌళి ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్ దర్శకత్వం వహించగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని సమాచారం. ఇదే కాన్సెప్ట్‌పై అమీర్, రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా కూడా స్క్రిప్ట్ సమస్యల కారణంగా నిలిచిపోయిందని తెలుస్తోంది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం — అమీర్‌కి ఈ కథ ప్రస్తుత ప్రేక్షకులకు బోరింగ్‌గా, ఎమోషన్ లేకుండా అనిపించిందట. ఎన్నిసార్లు రీ–రైటింగ్ చేసినా తగిన ఫీలింగ్ రాకపోవడంతో హిరాణి–అమీర్లు కలసి ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా ఆపేశారు. ఫాల్కే కుటుంబం హిరాణి వర్షన్‌కు మద్దతు ఇస్తే, రాజమౌళి వర్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరువురు దర్శకుల ప్రాజెక్టులు నిలిచిపోవడంతో ఇప్పుడు ఫాల్కే గాథను తెరపైకి తెచ్చేది ఎవరో చూడాలి.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!