
జనరల్

ఈ ఏడాది ‘లెనిన్’ సినిమాతో విజయాన్ని అందుకున్న అఖిల్ అక్కినేని మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు. ఇప్పుడు అదే స్థాయి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న మరో ఇద్దరు స్టార్ హీరోలు ఆగస్టులో తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
మరోవైపు మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ కూడా ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. రవితేజకు ఈ చిత్రం బలమైన కంబ్యాక్ అందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్ విజయానంతరం వరుణ్ తేజ్, రవితేజల్లో ఎవరు ప్రేక్షకులను ఆకట్టుకుని విజయాల బాట పడతారన్న ఆసక్తి సినీ వర్గాల్లో కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!