
టెక్నాలజీ

తెలుగు సినీ పరిశ్రమలో సహజ భావోద్వేగాలతో కథలను తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు పొందిన శేఖర్ కమ్ముల తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన దర్శకుడు, నటీనటుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఆయన రూపొందించిన సినిమాలు మంచి విజయాలు సాధించి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు బాపు గారు తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తనను ఎంతో ఆకట్టుకుంటాయని చెప్పారు. ఇక నటీమణుల్లో సావిత్రి గారి నటన అసాధారణమని ప్రశంసించారు. వారి ప్రభావం తనపై చాలా ఉందని ఆయన వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!