

క్రిస్మస్, సంక్రాంతి సీజన్లలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా సినిమాలు విడుదల కావడం సాధారణమే. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఛాంపియన్, శాంబాలా, ఈషా, దండోరా, పతంగ్, వృషభ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. అయితే వీటిలో వృషభ సినిమా విడుదలపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత బన్నీవాసు మీడియా సమావేశంలో స్పందిస్తూ, సినిమాపై వస్తున్న విమర్శలకు స్పష్టత ఇచ్చారు. మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో మొదట రోషన్ మేకాను ఎంపిక చేయగా, కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
వృషభ సినిమా డబ్బింగ్ చిత్రం కాదని, నేరుగా సెన్సార్ బోర్డు నుంచి తెలుగు సర్టిఫికేట్ పొందిందని బన్నీవాసు స్పష్టం చేశారు. ఇది మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ప్లాన్‌తో రూపొందిన సినిమా కావడంతో విడుదల తేదీని మార్చడం సాధ్యం కాదని అన్నారు. వాస్తవానికి ఈ సినిమా రెండు నెలల క్రితమే విడుదల కావాల్సి ఉండగా, అప్పటి థియేటర్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిందని వివరించారు. ప్రస్తుతం వృషభపై జరుగుతున్న విమర్శలు అవసరం లేనివని, సినిమా కంటెంట్‌పై నమ్మకం ఉందని ఆయన తెలిపారు.







.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!