

భారత స్వాతంత్ర సంగ్రామ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విప్లవ వీరుడు’ షూటింగ్ ఫిలింనగర్‌లోని దైవ సన్నిధానంలో ఘనంగా ప్రారంభమైంది. ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో, ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్రలో నటిస్తుండగా, జైశ్వర్–సోనాలి జంటగా కనిపించనున్నారు. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రం స్వాతంత్ర ఉద్యమంలో సామాన్యులు ఎలా విప్లవ వీరులుగా మారి పోరాడారనే అంశాన్ని మనసును హత్తుకునేలా ఆవిష్కరించనుంది.
ఇంద్రజ మాట్లాడుతూ, తాను రాణి భవానిదేవి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఒక సామాన్యుడు విప్లవ వీరుడిగా ఎదిగే కథ ఈ సినిమాకి ప్రధాన బలం అని పేర్కొన్నారు. హీరో జైశ్వర్ ఈ పాత్ర తన కెరీర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని అన్నారు. దర్శకుడు ఎస్ నాగరాజ్ రావు ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, బ్రిటిష్ కాలం నాటి చారిత్రక కథను నిజాయితీగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. నిర్మాత ఏవీ జయరాం ఈ సినిమా బలమైన సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!