

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా విడుదలకు మళ్లీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం చట్టపరమైన సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఈ సినిమాను Central Board of Film Certification రివైజింగ్ కమిటీకి పంపించారు. నేడు కమిటీ ఈ చిత్రాన్ని వీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, కమిటీలోని ఓ సభ్యుడు అనారోగ్యానికి గురికావడంతో చివరి నిమిషంలో స్క్రీనింగ్ వాయిదా పడింది. తదుపరి తేదీని కూడా ప్రకటించకపోవడంతో సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇక అన్ని సమస్యలు పరిష్కారమైతే ఈ చిత్రాన్ని మొదట ఫిబ్రవరిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఆ తరువాత ఏప్రిల్ విడుదలకు ప్లాన్ చేసినప్పటికీ, రివైజింగ్ కమిటీ నుంచి ఇంకా రిపోర్ట్ రాకపోవడంతో అది కూడా సాధ్యంకాకపోవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. జూన్ 22న ఆయన పుట్టినరోజు కావడంతో, జూన్ 18న ‘జన నాయగన్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!