

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జన నాయకన్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మలేసియాలో ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
భారీ స్థాయిలో జరిగిన ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి విజయ్ అభిమానులు తరలివచ్చారు. దాదాపు 85 వేల మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతదేశం వెలుపల నిర్వహించిన తమిళ సినిమా ఆడియో లాంచ్‌కు ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈ ఈవెంట్ మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అధికారికంగా చోటు దక్కించుకుంది.
ఈ కార్యక్రమంలో విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానుల సమక్షంలోనే ఆయన సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
నా సినిమాలను థియేటర్లలో చూసి నన్ను ఇంతకాలం ఆదరించిన అభిమానుల కోసం నేను ఎప్పటికీ నిలబడతాను. వారి సేవ చేయడానికే ఇప్పుడు సినిమాలకు స్వస్తి పలుకుతున్నాను అని విజయ్ చెప్పారు. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, మమిత బైజు, ప్రియమణి, బాబీ దేవోల్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ వేడుకలో విజయ్ డ్యాన్స్ చేసి అభిమానులను మరింత ఉత్సాహపరిచారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!