
జనరల్

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అభిమానుల దృష్టిని ఆకర్షించారు. వివాహం అనంతరం తమ కెరీర్లపై దృష్టి పెట్టిన ఈ జంట, వేదికపై పంచుకున్న ఆప్యాయ క్షణాలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్యక్రమం సందర్భంగా విజయ్‌కు చెమట రావడంతో రష్మిక కర్చీఫ్‌తో తుడవడమే కాకుండా సరదాగా ఆయన మీసాలను తిప్పడం అభిమానులను ఆకట్టుకుంది.
అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 47 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9, 10 తరగతులలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 151 మంది విద్యార్థులకు విజయ్–రష్మిక దంపతులు నగదు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా వారి అనుబంధాన్ని ప్రశంసిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తుండగా, విద్యార్థులను ప్రోత్సహించే వారి కార్యక్రమాన్ని కూడా అభినందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!