
బిజినెస్

నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ టీమ్‌కు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పెయిడ్ ప్రీమియర్ షోల సందర్భంగా నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే తన పర్సనల్ ఫేవరెట్ ట్రాక్స్‌గా మారాయని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
తెలంగాణ నేల, ప్రజల జీవన విధానం, పోరాట స్ఫూర్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథ ప్రేక్షకులకు దగ్గరగా అనిపిస్తోందని విజయ్ దేవరకొండ అన్నారు. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమా సరిహద్దులు దాటి ప్రపంచ ప్రేక్షకులను చేరుకోవాలని, భవిష్యత్తులోనూ మన సొంత నేటివిటీని ప్రతిబింబించే మరిన్ని విభిన్నమైన కథలు రావాలని ఆయన పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!