

తెలుగు చిత్ర పరిశ్రమను వేధిస్తున్న ఫేక్ రివ్యూల సమస్యపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. కోర్టు ఆదేశాల మేరకు బుక్‌మైషో తన వెబ్సైట్లో సినిమాల రేటింగ్స్, రివ్యూలను తాత్కాలికంగా నిలిపివేయడంపై ఆయన ఎక్స్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల అనేక మంది కష్టం, కలలు, పెట్టుబడులు కాపాడుకునే అవకాశం కనిపించిందని చెబుతూ, ఇదే సమయంలో మన సొంత వాళ్లే ఇలాంటి సమస్యలు సృష్టించడం బాధాకరమని పేర్కొన్నారు.
‘డియర్ కామ్రేడ్’ విడుదల సమయంలో కూడా వ్యవస్థీకృత దాడులను ఎదుర్కొన్నానని, ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదని విజయ్ తెలిపారు. ఎందుకోసం ఇలాంటి నెగెటివిటీ జరుగుతుందో అనుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. కోర్టు ఈ సమస్యను గుర్తించి చర్యలు తీసుకోవడం పూర్తి పరిష్కారం కాకపోయినా, కొంత ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ఈ వివాదాలను పక్కనపెట్టి, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సహా సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు విజయవంతమవాలని, ప్రేక్షకులను అలరించాలని కోరారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!