

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మోస్ట్ లవ్‌బుల్ పెయిర్‌గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న తమ వివాహాన్ని అధికారికంగా ధృవీకరించారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదిస్తూ ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. అభిమానులు ముందుగానే ప్రేమతో తమకు పెట్టిన “విరోష్” పేరును గౌరవిస్తూ తమ కలయికకు “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. దశాబ్ద కాలంగా అందిస్తున్న అపారమైన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ అభిమానులు తమ జీవితంలో ఎప్పటికీ భాగమని పేర్కొన్నారు.
గత ఏడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఈ నెల 26 న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న వారసత్వ రాజభవనంలో వీరి వివాహం అత్యంత గోప్యంగా జరగనుంది. ఈ నెల 24 న సంగీత్, మెహందీ వేడుకలు, ఈ నెల25 న హల్దీ కార్యక్రమం నిర్వహించనున్నారు. వచ్చే నెల 4 న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వెండితెర పై గీత గోవిందం తో మెరిసిన ఈ జంట నిజ జీవితంలో ఒక్కటవ్వడం పట్ల అభిమానులు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!