
ఆరోగ్యం

హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘బ్లాక్ మెయిల్’ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన పూజా కార్యక్రమంలో సినీ ప్రముఖులు, అతిథులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ చిత్రంలో జెమిని సురేష్, పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ తొలి క్లాప్ కొట్టగా, భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన వరుణ్ సందేశ్ కథ, స్క్రీన్‌ప్లేపై నమ్మకం వ్యక్తం చేశారు. నిర్మాత అవినాష్ మాట్లాడుతూ సినిమా లాభాల్లో 10 శాతం టెక్నీషియన్స్‌కు అందజేస్తానని ప్రకటించారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!