

ఉపేంద్ర మాట్లాడుతూ, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో భాగం కావడం తనకు చాలా ఆనందంగా ఉందని, కథ వినగానే ఫ్యాన్స్ ఎమోషన్‌తో వెంటనే కనెక్ట్ అయ్యానని చెప్పారు. అభిమానుల ప్రేమకు లాజిక్ ఉండదని, ఆ భావన ఈ సినిమాలో అద్భుతంగా చూపించారని పేర్కొన్నారు. తన బర్త్‌డేను ఫ్యాన్స్ డేగా జరుపుకోవడం వల్ల, అభిమానుల ప్రేమ ఎంత పెద్దదో ప్రతి సంవత్సరం అనుభవిస్తానన్నారు. సినిమాలో తాను పోషించిన సూర్య పాత్ర స్టార్ల నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని, ఫ్యాన్స్ క్రేజ్, అప్ అండ్ డౌన్స్, హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ నిజ జీవిత స్పర్శతో ఉంటాయని చెప్పారు. డైరెక్టర్ మహేష్ బాబు పి చెప్పిన ప్రతి డైలాగ్, ప్రతి సీన్ హృదయాన్ని తాకేలా ఉందని, ఇలాంటి మంచి విషయం అందించిన మైత్రి మూవీ మేకర్స్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, ‘A’ సినిమా రోజున ఫ్యాన్స్ కారణంగా సినిమా మిస్ అవుతారనే భావనతో థియేటర్‌కి వెళ్లడం ఆపేశానన్నారు. చిన్నప్పట్లో రజినీకాంత్, చిరంజీవి, నాగార్జున సినిమాల మొదటి షోలు చూడటం ఒక పెద్ద ఆనందమని చెప్పారు. రామ్ పోతినేనితో పని చేయడం గురించి మాట్లాడుతూ, ఆయన ఎనర్జీ అద్భుతమని, ఇంటర్వెల్ సీన్‌ను చూసిన వెంటనే గూస్బంప్స్, వస్తాయని చెప్పారు. స్టార్ అయినా కూడా ఫ్యాన్ అమాయకత్వాన్ని ఆయన చూపిన తీరు అద్భుతమని అన్నారు. భాగ్యశ్రీ–రామ్ కెమిస్ట్రీ చాలా బాగా పనిచేసిందని, వారి లవ్ స్టోరీకి రెట్రో ఫీలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
సినిమా పాటలు ఇప్పటికే ప్రజల్లోకి బాగా వెళ్లాయని, నాలుగు పాటలు చార్ట్బస్టర్లు అయ్యాయని, బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ కూడా చాలా బాగుందని చెప్పారు. తన డైరెక్షన్లో చిరంజీవి గారితో సినిమా చేయాలని ఇప్పటికీ డ్రీమ్‌గా ఉందని, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానన్నారు. రజినీకాంత్‌తో ‘కూలీ’ సినిమాలో నటించడం తన జీవితంలో పెద్ద మైల్స్టోన్ అని, ఆయన్ని తాను ఒక భక్తుడిలా అభిమానిస్తానని చెప్పారు. ఇంకా కొత్త కథలు, కొత్త పాత్రలు చేయాలనే తపన ఎప్పటికీ తగ్గదని ఉపేంద్ర తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!