

ఐబొమ్మ అడ్మిన్ రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కొంత ఊపిరి పీల్చుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పైరసీ వెబ్సైట్ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తీసుకురావడంతో పాటు పరిశ్రమ ఎదుగుదలకే అడ్డుపడుతోంది. ఈ అరెస్ట్‌తో పైరసీపై జరుగుతున్న పోరాటంలో ఒక సానుకూల మార్పు వస్తుందనే నమ్మకం కలిగింది.
ఈ పరిణామం నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ సభ్యుడు సి. కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవిని పట్టుకున్న పోలీసు అధికారులను త్వరలో సన్మానిస్తామని ఆయన తెలిపారు. ఈ అరెస్ట్‌పై ఫిల్మ్ చాంబర్ చాలా సంతోషంగా ఉందని కూడా పేర్కొన్నారు.
అయితే కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక దశలో షాకింగ్‌గా మారాయి. రవిని ఎన్కౌంటర్ చేయాలని ఆయన బహిరంగంగా కోరారు. తన మాటలు కఠినంగా అనిపించినప్పటికీ, ఈ పైరసీ రాకాసి వ్యవస్థ వల్ల పరిశ్రమ అనుభవించిన ఏళ్ల కొద్ది నష్టాలు, బాధల నుంచే ఈ కామెంట్ వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే కఠిన చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.







.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!