

కోడళ్లు కుటుంబంలోకి రావడంతో ఇంటి వాతావరణమే మారిపోయిందని నటి అమల అక్కినేని ఆనందం వ్యక్తం చేశారు. నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ, అఖిల్ అక్కినేని భార్య జైనబ్ రవ్ద్జీతో తనకున్న అనుబంధం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. గతంలో తమ ఇంట్లో ఎక్కువగా పురుషులే ఉండేవారని, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిల రాకతో ఇంట్లో మహిళల సందడి పెరిగిందని తెలిపారు. అత్తగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్న అమల.. “ఇంతకుముందు మా కుటుంబంలో ఎక్కువగా మగవాళ్లే ఉండేవారు. ఇప్పుడు నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంట్లో మహిళల సందడి ఉండటం చాలా బాగుంది” అని పేర్కొన్నారు.
శోభిత గురించి మాట్లాడుతూ, ఆమె వృత్తిపరంగా సాధించిన విజయాలను అమల ప్రశంసించారు. శోభిత ఎంతో ఆప్యాయంగా ఉంటుందని, అందరితో సులభంగా కలిసిపోతుందని అన్నారు. జైనబ్‌తో తనకు మరింత దగ్గరి అనుబంధం ఉందని, అఖిల్ ఆమెతో ప్రేమలో ఉన్న సమయంలోనే పరిచయం ఏర్పడిందని చెప్పారు. అప్పటి నుంచే జైనబ్ తనకు ఎంతో నచ్చిందని, ఆమెను సొంత కూతురిలా భావిస్తానని తెలిపారు. జైనబ్ తనకెంతో శ్రద్ధగా చూసుకుంటుందని, నాగార్జునను కూడా బాగా చూసుకుంటుందని అమల వెల్లడించారు. అంతేకాకుండా, పండగల వేడుకల్లోనూ జైనబ్ తమ ఇంటికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందన్నారు. గతంలో పండగలను కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరుపుకునేవారని, జైనబ్ వచ్చిన తర్వాత ప్రతి వేడుకను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!