

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం పళ్లిచట్టంబి . డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్ ఫిల్మ్స్, సీ క్యూబ్ బ్రదర్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజేష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. కథానాయికగా కాయదు లోహర్ నటిస్తోంది. తాజాగా చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
1950 – 60 దశకాలను నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ఈ పీరియడ్ డ్రామా చిత్రంలో టోవినో థామస్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు. పళ్లిచట్టంబి చిత్రం ఏప్రిల్ 9 న మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో విజయరాఘవన్, సుధీర్ కరమణ, బాబురాజ్, వినోద్ కేడమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!