
క్రీడలు

తమిళ స్టార్ సూర్య, జ్యోతిక తమ పిల్లలతో కలిసి ఇటీవల చేసిన అరుదైన పబ్లిక్ అపియరెన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా వారి కుమారుడు దేవ్ లుక్ 1999లో పూవెల్లాం కెట్టుప్పార్ సినిమాలో యువ సూర్యాను గుర్తు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సారూప్యతతో ఫ్యాన్స్ వెంటనే మీమ్స్, కామెంట్స్‌తో సోషల్ మీడియాను హీటెక్కించారు.
కొంతమంది ఫ్యాన్స్ ఇది “టైమ్ ట్రావెల్ సీన్‌లా ఉంది” అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. సూర్య–జ్యోతిక జంట సినీ ప్రయాణం నుంచి కుటుంబంగా ఎదిగిన ఈ అరుదైన క్షణం అభిమానుల్లో నస్టాల్జియా తెచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!