

‘లెజెండ్’ తర్వాత తాను చేసిన వందకుపైగా సినిమాల్లో కేవలం ఆరు మాత్రమే గుర్తుంటాయని, వాటిలో ‘పెద్ది’ ఒకటని నటుడు జగపతిబాబు అన్నారు. ఈ సినిమా తన కెరీర్లో నెంబర్ వన్ కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’లో ఆయన అప్పలసూరి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 4 న విడుదల కానుంది.
అప్పలసూరి పాత్ర తనకు నటన పరంగా అత్యంత సంతృప్తినిచ్చిందని జగపతిబాబు తెలిపారు. ప్రోస్థెటిక్ మేకప్ కోసం గంటల తరబడి సమయం పట్టేదని, చర్మ సమస్యలు కూడా ఎదురయ్యాయని చెప్పారు. రామ్ చరణ్ కష్టపడే తత్వాన్ని, బుచ్చిబాబు సానా దర్శకత్వ స్పష్టతను ఆయన ప్రశంసించారు. రత్నవేలు, ఏఆర్ రెహమాన్ వంటి సాంకేతిక నిపుణులతో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ‘పెద్ది’ తన నటజీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!