

టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న యాంకర్ ఎవరని అడిగితే, ముందుగా వినిపించే పేరు సుమదే. కేరళ నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడిన ఆమె, స్వచ్ఛమైన తెలుగుతో, ఎనర్జీతో కూడిన వ్యాఖ్యానంతో దశాబ్దాలుగా టాప్ స్పాట్లో కొనసాగుతోంది. మూడు కోట్ల చిన్న సినిమా ఈవెంట్ కావొచ్చు లేదా వెయ్యి కోట్ల భారీ పాన్ వరల్డ్ మూవీ కావొచ్చు ఈవెంట్ అంటే సుమ అనేది ఒక ముద్రగా మారింది. అలాంటి సుమ ఇప్పుడు ప్రేమంటే చిత్రంతో మరోసారి నటి గా రీ ఎంట్రీ ఇవ్వబోతుండటం ప్రత్యేకం.
అయితే సుమ మొదట టాలీవుడ్‌కి హీరోయిన్గా వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. 1996 లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు కళ్యాణ ప్రాప్తిరస్తు కోసం నటీనటులను ఎంపిక చేస్తూ భారీ ఆడిషన్ నిర్వహించారు. వేలల్లో వచ్చిన అప్లికేషన్లలో నుండి నలుగురిని మాత్రమే ఫైనల్ చేశారు. వారిలో ఒకరు వక్కంతం వంశీ కాగా, మరొకరు సుమ. ప్రేమ నేపథ్యంతో పాటు టీవీ చానల్ బ్యాక్‌డ్రాప్ ఉండటం ఆ సినిమా ప్రత్యేకత.
కానీ కళ్యాణ ప్రాప్తిరస్తు థియేటర్లలో డిజాస్టర్‌గా మారింది. కథ బలహీనం కావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఆ తర్వాత సుమ పూర్తిగా టీవీ వైపు వెళ్లి, టాలీవుడ్లో అగ్ర యాంకర్‌గా ఎదిగి, రాజీవ్ కనకాలతో కుటుంబం ఏర్పరుచుకుని, తన కొడుకు రోషన్‌ను హీరోగా చూసుకునే స్థాయికి చేరుకుంది. జయమ్మ పంచాయితీలో టైటిల్ రోల్ చేసినా ఫలితం పెద్దగా రాలేదు. ఇప్పుడు ఆమె నటిగా ఉన్న నెగటివ్ సెంటిమెంట్‌ను ప్రేమంటే బ్రేక్ చేస్తుందా అన్నది ఆసక్తికరం. ప్రియదర్శి–ఆనంది జంటగా నటిస్తున్న ఈ లవ్ స్టోరీలో సుమ ఒక పోలీస్ పాత్రలో కనిపించనుంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!