

బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంలో ఏర్పాటు చేసిన రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ప్స్ (IRGC) ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన రాడార్ వ్యవస్థను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ దాడి జరిగిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. అయితే, దాడి వల్ల జరిగిన నష్టం ఎంత? ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? అసలు దాడి ఎలా జరిగింది? అనే వివరాలు ఇంకా స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.
ఈ పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య మరిన్ని సైనిక చర్యలు చోటుచేసుకుంటే పశ్చిమ ఆసియా ప్రాంత భద్రత, స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా సైనిక స్థావరాల భద్రతతో పాటు ఈ వివాదం మరింత విస్తరించే అవకాశాలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు, నష్టంపై స్వతంత్ర నిర్ధారణ వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!