

బిగ్‌బాస్ తెలుగు 10 డే 70 ప్రోమో 2 విడుదలైంది. ఈ ప్రోమోలో ఫ్యామిలీ సర్‌ప్రైజ్‌లు, భావోద్వేగ క్షణాలు, సరదా సందడి కలగలిపి కనిపించాయి. డెబ్జానీ కోసం అమర్‌దీప్, నందిని గెస్టులుగా వచ్చారు. మరోవైపు హోస్ట్ నాగార్జున.. సుధీర్ తండ్రి పంపిన సందేశాన్ని వెల్లడించారు. సుధీర్‌ను కలిసేందుకు అతని తండ్రితో పాటు పవన్ కూడా హౌస్‌కు వచ్చారు. నీతూ మాస్టర్‌ను కలిసేందుకు తనూజా రాగా, నరేష్‌ను కలిసేందుకు బుల్లెట్ భాస్కర్ వచ్చారు. తమకు ఇష్టమైన వారిని కలుసుకున్న కంటెస్టెంట్లలో ఆనందం, ఉత్సాహం కనిపించాయి.
ప్రోమోలో మరో ఆసక్తికరమైన అంశం కంటెస్టెంట్లకు గెస్టులు ఇచ్చిన ర్యాంకింగ్స్. తమ అభిప్రాయాల ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్లను ఎంపిక చేసి వరుసగా ఉంచారు. గెస్టుల ఎంపికలు హౌస్‌లో ఆసక్తిని పెంచడంతో పాటు కంటెస్టెంట్లలో పోటీ వాతావరణాన్ని సృష్టించాయి. కుటుంబ సభ్యులతో కలయికలు, నాగార్జున ఇచ్చిన సర్‌ప్రైజ్, గెస్టుల అభిప్రాయాలు, సరదా సంభాషణలతో ప్రోమో ఆకట్టుకుంటోంది. మొత్తంగా రాబోయే వీకెండ్ ఎపిసోడ్‌లో వినోదంతో పాటు భావోద్వేగ క్షణాలు కూడా ఉండబోతున్నాయని ఈ ప్రోమో సూచిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!