24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమా హీరోలకు.. నిజ జీవితంలోని పవర్‌ఫుల్ వ్యక్తులకు తేడా అదే: ఆర్జీవీ

Writer: G.Sreekanth Reddy 09:08 AM, 24 నవంబర్, 2026
సినిమా హీరోలకు.. నిజ జీవితంలోని పవర్‌ఫుల్ వ్యక్తులకు తేడా అదే: ఆర్జీవీ

సినిమాల్లో కండలు తిరిగిన దేహంతో, సిక్స్ ప్యాక్‌తో కనిపించే హీరోలకు, నిజ జీవితంలో అధికారం చెలాయించే శక్తిమంతులకు ఏమాత్రం సంబంధం ఉండదని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి, అది లేని వ్యక్తి కింద పనిచేయడమే నిజ జీవితంలో కనిపించే వాస్తవమని తన 'ఎక్స్' ఖాతాలో ఆర్‌జీవీ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు.

"ది ఐరనీ ఆఫ్ టఫ్ హీరోస్ హైడింగ్ బిహైండ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్" అనే లైన్‌తో వర్మ ఈ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "బాహుబలి ముందు నుంచి లేదా ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఒక నిజాన్ని విస్మరించారు. నిజ జీవితంలోని శక్తిమంతులు ఎవర  సినిమాల్లో కనిపించే కండలు తిరిగిన హీరోల్లా ఉండరు. నిజానికి కండలున్న సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నవారు తరచుగా పొట్టిగా, సన్నగా, లావుగా లేదా పొట్ట ఉన్న వ్యక్తుల కింద పనిచేస్తుంటారు" అని వర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

సినిమాల్లో సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తినే అత్యంత బలవంతుడిగా చూపిస్తారని, కానీ నిజ జీవితంలో అలాంటి వ్యక్తి, జిమ్ మొహం చూడని పొట్టి, బట్టతల ఉన్న వ్యక్తి వెనుక నిలబడి ఉంటాడని వర్మ వివరించారు. ఆ సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి జీవించడానికి అవసరమైన జీతాన్ని ఇచ్చేది కూడా ఆ సాధారణ వ్యక్తియేనని పేర్కొన్నారు. తన వాదనకు బలం చేకూర్చుతూ చారిత్రక ఉదాహరణలను ప్రస్తావించారు. "చక్రవర్తి నెపోలియన్ 5 అడుగుల 6 అంగుళాలు మాత్రమే ఉండి, ఒక గుమాస్తాలా కనిపించేవాడు. కానీ, యూరప్‌లోని బలవంతులంతా ఆయన కింద పనిచేసేవారు. కేవలం 5 అడుగుల 4 అంగుళాలున్న స్టాలిన్ ఒక బంగాళాదుంపలా కనిపించినా, ఆయన ఆదేశాలను అమలు చేసే సైనికాధికారులు మాత్రం ఫిట్‌గా ఉండేవారు. కానీ, వారిని క్షణాల్లో కాల్చి చంపగల అధికారం స్టాలిన్‌ది" అని తెలిపారు.

అల్ కపోన్ నుంచి పాబ్లో ఎస్కోబార్, దావూద్ ఇబ్రహీం వరకు ఏ మాఫియా డాన్ కూడా కండలు తిరిగిన శరీర సౌష్టవంతో లేరని వర్మ గుర్తుచేశారు. వారి కోసం హత్యలు చేసే కింది స్థాయి వ్యక్తులే శారీరకంగా బలంగా ఉంటారని, వారికి తక్కువ జీతం ఇచ్చి సులభంగా వదిలించుకుంటారని అన్నారు.  భారత రాజకీయాల్లోనూ ఇదే కనిపిస్తుందని, ఫోన్ కంటే బరువైన వస్తువును ఎత్తని నాయకుల చుట్టూ ఆరడుగుల బాడీగార్డులు బానిసల్లా కాపలా కాస్తుంటారని వ్యాఖ్యానించారు. సైన్యంలో సైతం పొట్ట ఉన్న జనరల్స్, ఫిట్‌గా ఉండే సైనికులను యుద్ధంలోకి పంపిస్తారని, వారేమో బుల్లెట్ల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని వర్మ విశ్లేషించారు. "కాబట్టి, సినిమాల్లో సిక్స్ ప్యాక్ అనేది శక్తికి చిహ్నం కాదు, అదొక అలంకారం మాత్రమే. నిజ జీవితంలో సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి ఎప్పుడూ దాని గురించి పట్టించుకోని వ్యక్తి కిందే పనిచేస్తాడు!" అంటూ వర్మ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!

యాపిల్ మ్యాప్స్‌లో ‘వారణాసి’ భారీ సెట్.. వైరల్‌గా వీడియో!

యాపిల్ మ్యాప్స్‌లో ‘వారణాసి’ భారీ సెట్.. వైరల్‌గా వీడియో!

ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా.. అప్పుడే విడుదల!

ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా.. అప్పుడే విడుదల!

‘వృషకర్మ’ నిడివి మూడు గంటలకుపైనేనా?

‘వృషకర్మ’ నిడివి మూడు గంటలకుపైనేనా?

ట్యాగ్లు
సినీ దర్శకుడురామ్ గోపాల్ వర్మకండలు తిరిగిన దేహంసిక్స్ ప్యాక్‌నిజ జీవితం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా
జనరల్

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు
జనరల్

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం
జనరల్

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం

ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోంది.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు
రాజకీయాలు

ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోంది.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు

‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల.. జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన వెబ్ సిరీస్
షోస్

‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల.. జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన వెబ్ సిరీస్

చలికాలంలో క్యారెట్ జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన విషయాలివే!
ఆరోగ్యం

చలికాలంలో క్యారెట్ జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన విషయాలివే!

రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
సినిమాలు

రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

సినిమా హీరోలకు.. నిజ జీవితంలోని పవర్‌ఫుల్ వ్యక్తులకు తేడా అదే: ఆర్జీవీ
సినిమాలు

సినిమా హీరోలకు.. నిజ జీవితంలోని పవర్‌ఫుల్ వ్యక్తులకు తేడా అదే: ఆర్జీవీ

బైక్ ట్యాక్సీలుగా ప్రైవేట్ బైక్‌లు
జనరల్

బైక్ ట్యాక్సీలుగా ప్రైవేట్ బైక్‌లు

ట్రంప్ హష్ మనీ కేసులో కీలక మలుపు
జనరల్

ట్రంప్ హష్ మనీ కేసులో కీలక మలుపు

కార్తీకదీపంపై సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్
రాజకీయాలు

కార్తీకదీపంపై సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్

‘జ్యోతిష్యుల పాలన’ వివాదం.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
రాజకీయాలు

‘జ్యోతిష్యుల పాలన’ వివాదం.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!