

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ వివరాలపై ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ సంస్థ చేపట్టిన పరిశోధనలో పలు అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినట్లు కథనం పేర్కొంది. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలైన్లలో 56,067 మంది ఓటర్లు ఉన్నట్లు రికార్డుల్లో నమోదైందని వెల్లడించింది. అయితే, చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత నమోదైన ఓట్ల సంఖ్యను కలిపితే 24,596 మాత్రమే ఉన్నట్లు తెలిపింది. ఈ రెండు వివరాల మధ్య 31,471 ఓట్ల వ్యత్యాసం ఉన్నట్లు పరిశోధనలో గుర్తించినట్లు పేర్కొంది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించినప్పుడు ఓటింగ్ వివరాల్లో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ తేడాపై మేధావులు, రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో వ్యవస్థీకృత అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలకు ఈ వివరాలు బలం చేకూరుస్తున్నాయంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ గణాంకాల వ్యత్యాసానికి గల కారణాలు, ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అవకతవకలు జరిగాయా అనే అంశాలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!