24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Writer: G.Sreekanth Reddy 09:14 AM, 24 నవంబర్, 2026
రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ' గురించి మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా కోసం ఏకంగా 10 నుంచి 12 సినిమాలను వదులుకున్నట్లు తెలిపాడు. ప్రముఖ హాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్‌తో కలిసి గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీదే పూర్తి దృష్టి సారించినట్లు వెల్లడించాడు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల (ఇఫీ) వేదికగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన రెహమాన్.. ఈ సినిమా సంగీతం వెనుక సాగిన శ్రమను పంచుకున్నాడు.

ముఖ్యంగా సినిమాలో రాక్షసరాజు రావణుడికి సంబంధించిన 'రావణ తాండవం' ట్రాక్ కోసం ఏకంగా 12 నుంచి 13 రకాల వెర్షన్లను కంపోజ్ చేసినట్లు రెహమాన్ తెలిపాడు. "గత మూడేళ్లుగా మేం రామాయణ థీమ్స్, పాటలపై పనిచేస్తున్నాం. కొన్నింటికి డజనుకు పైగా వెర్షన్లు సిద్ధం చేయాల్సి వచ్చింది. అందులో 'రావణ తాండవం' కోసం 12-13 వెర్షన్లు చేశాక గానీ అందరికీ నచ్చిన ఒక పర్ఫెక్ట్ ట్యూన్ కుదరలేదు" అని చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ మూడ్‌లో నుంచి బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే పలువురు అగ్ర దర్శకుల ప్రాజెక్టులను వదులుకున్నానని, ఇందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, ఆధునిక ప్రపంచ సంగీత ధోరణులతో మేళవించడం ఒక సవాలని రెహమాన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా, రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మొదటి భాగానికి రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రధాన బలంగా నిలిచాయని ప్రశంసలు దక్కుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా హీరోలకు.. నిజ జీవితంలోని పవర్‌ఫుల్ వ్యక్తులకు తేడా అదే: ఆర్జీవీ

సినిమా హీరోలకు.. నిజ జీవితంలోని పవర్‌ఫుల్ వ్యక్తులకు తేడా అదే: ఆర్జీవీ

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!

యాపిల్ మ్యాప్స్‌లో ‘వారణాసి’ భారీ సెట్.. వైరల్‌గా వీడియో!

యాపిల్ మ్యాప్స్‌లో ‘వారణాసి’ భారీ సెట్.. వైరల్‌గా వీడియో!

ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా.. అప్పుడే విడుదల!

ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా.. అప్పుడే విడుదల!

‘వృషకర్మ’ నిడివి మూడు గంటలకుపైనేనా?

‘వృషకర్మ’ నిడివి మూడు గంటలకుపైనేనా?

ట్యాగ్లు
రామాయణ సినిమారెహమాన్హాలీవుడ్ స్వరకర్తహాన్స్ జిమ్మర్‌ 'రావణ తాండవం' 12-13 వెర్షన్లుకంపోజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బొగ్గులపై కాల్చిన చేప కూరతో ఎన్నో రుచులు.. వైద్యులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

బొగ్గులపై కాల్చిన చేప కూరతో ఎన్నో రుచులు.. వైద్యులు ఏమంటున్నారంటే!

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా
జనరల్

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు
జనరల్

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం
జనరల్

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం

ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోంది.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు
రాజకీయాలు

ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోంది.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు

‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల.. జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన వెబ్ సిరీస్
షోస్

‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల.. జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన వెబ్ సిరీస్

చలికాలంలో క్యారెట్ జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన విషయాలివే!
ఆరోగ్యం

చలికాలంలో క్యారెట్ జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన విషయాలివే!

రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
సినిమాలు

రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

సినిమా హీరోలకు.. నిజ జీవితంలోని పవర్‌ఫుల్ వ్యక్తులకు తేడా అదే: ఆర్జీవీ
సినిమాలు

సినిమా హీరోలకు.. నిజ జీవితంలోని పవర్‌ఫుల్ వ్యక్తులకు తేడా అదే: ఆర్జీవీ

బైక్ ట్యాక్సీలుగా ప్రైవేట్ బైక్‌లు
జనరల్

బైక్ ట్యాక్సీలుగా ప్రైవేట్ బైక్‌లు

ట్రంప్ హష్ మనీ కేసులో కీలక మలుపు
జనరల్

ట్రంప్ హష్ మనీ కేసులో కీలక మలుపు

కార్తీకదీపంపై సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్
రాజకీయాలు

కార్తీకదీపంపై సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!