24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్ హష్ మనీ కేసులో కీలక మలుపు

Writer: G.Sreekanth Reddy 08:56 AM, 24 నవంబర్, 2026
ట్రంప్ హష్ మనీ కేసులో కీలక మలుపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ క్రిమినల్ కేసులో ఊరట లభించింది. ఈ కేసులో తనపై పడిన 34 నేరారోపణలను రద్దు చేయించుకునేందుకు ఆయనకు ఒక కొత్త మార్గం తెరుచుకుంది. ఈ కేసు విచారణను రాష్ట్ర కోర్టు నుంచి ఫెడరల్ కోర్టుకు బదిలీ చేయాలన్న ఆయన అభ్యర్థనను పునరుద్ధరిస్తూ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధ్యక్షుడిగా తనకు లభించే రక్షణ (ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీ) ఆధారంగా ఈ కేసును కొట్టివేయాలని వాదించేందుకు ట్రంప్‌కు అవకాశం ద‌క్కింది.

గతంలో ట్రంప్ అభ్యర్థనను పలుమార్లు తిరస్కరించిన ఫెడరల్ జడ్జి అల్విన్ హెల్లర్‌స్టీన్ తన తీర్పులలో పొరపాట్లు చేశారని 2వ సర్క్యూట్ కోర్టుకు చెందిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసును తిరిగి దిగువ ఫెడరల్ కోర్టుకు పంపి, ట్రంప్ అభ్యర్థనపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా, జడ్జి హెల్లర్‌స్టీన్ గత అక్టోబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఈ తాజా తీర్పు కారణంగా, న్యూయార్క్ రాష్ట్ర కోర్టులో ట్రంప్ దాఖలు చేసిన అప్పీల్ ప్రక్రియ కూడా నిలిచిపోనుంది.


శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు చెల్లించిన వ్యవహారాన్ని రహస్యంగా ఉంచేందుకు వ్యాపార రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలపై 2024 మే నెలలో న్యూయార్క్ జ్యూరీ ట్రంప్‌ను 34 అభియోగాల్లో దోషిగా నిర్ధారించింది. దీంతో ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. అయితే, ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. ఈ కేసులో ఆయనకు ఇంకా ఎలాంటి శిక్ష ఖరారు కాలేదు.


అధ్యక్షుడిగా అధికారిక విధుల్లో భాగంగా చేసిన పనులకు క్రిమిన‌ల్‌ కేసుల నుంచి రక్షణ ఉంటుందని ట్రంప్ న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ కేసు విచారణలో తన ఓవల్ ఆఫీస్ సంభాషణలు, సోషల్ మీడియా పోస్టుల వంటి అధికారిక కార్యకలాపాలను ప్రాసిక్యూషన్ సాక్ష్యంగా చూపించిందని, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన అధ్యక్షుడి రక్షణ తీర్పునకు విరుద్ధమని వారు పేర్కొంటున్నారు.అయితే, హష్ మనీ చెల్లించడం అనేది అధ్యక్షుడి అధికారిక విధి కాదని ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. ఈ తీర్పుపై ట్రంప్ న్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను డెమోక్రాట్లు ఆయుధంగా మార్చడాన్ని అడ్డుకుని, సరైన తీర్పు ఇచ్చినందుకు 2వ సర్క్యూట్ కోర్టుకు అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొంది. 

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బైక్ ట్యాక్సీలుగా ప్రైవేట్ బైక్‌లు

బైక్ ట్యాక్సీలుగా ప్రైవేట్ బైక్‌లు

లిబియా తీరంలో రష్యా నౌక.. దాడి చేసింది మేమేనన్న ఉక్రెయిన్

లిబియా తీరంలో రష్యా నౌక.. దాడి చేసింది మేమేనన్న ఉక్రెయిన్

ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!

ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!

కొండ రూపంలో కొలువైన పరమశివుడు.. అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం కలుగుతుందని ఎందుకంటారు?

కొండ రూపంలో కొలువైన పరమశివుడు.. అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం కలుగుతుందని ఎందుకంటారు?

ట్యాగ్లు
అమెరికాప్రెసిడెంట్డోనాల్డ్ ట్రంప్హష్ మనీ కేసు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోంది.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు
రాజకీయాలు

ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోంది.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు

‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల.. జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన వెబ్ సిరీస్
షోస్

‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల.. జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన వెబ్ సిరీస్

చలికాలంలో క్యారెట్ జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన విషయాలివే!
ఆరోగ్యం

చలికాలంలో క్యారెట్ జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన విషయాలివే!

రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
సినిమాలు

రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

సినిమా హీరోలకు.. నిజ జీవితంలోని పవర్‌ఫుల్ వ్యక్తులకు తేడా అదే: ఆర్జీవీ
సినిమాలు

సినిమా హీరోలకు.. నిజ జీవితంలోని పవర్‌ఫుల్ వ్యక్తులకు తేడా అదే: ఆర్జీవీ

బైక్ ట్యాక్సీలుగా ప్రైవేట్ బైక్‌లు
జనరల్

బైక్ ట్యాక్సీలుగా ప్రైవేట్ బైక్‌లు

ట్రంప్ హష్ మనీ కేసులో కీలక మలుపు
జనరల్

ట్రంప్ హష్ మనీ కేసులో కీలక మలుపు

కార్తీకదీపంపై సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్
రాజకీయాలు

కార్తీకదీపంపై సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్

‘జ్యోతిష్యుల పాలన’ వివాదం.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
రాజకీయాలు

‘జ్యోతిష్యుల పాలన’ వివాదం.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
రాజకీయాలు

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్
రాజకీయాలు

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్
షోస్

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!