

ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రక్రియలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన మాజీ కంటెస్టెంట్స్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చి, ప్రస్తుత సభ్యులను నామినేట్ చేయించారు. దీంతో హౌస్‌లో వాడీవేడీ వాగ్వాదాలు జరిగాయి. ముందుగా వచ్చిన షాలిని నీతూను నామినేట్ చేస్తూ, ఫిజికల్ టాస్కులు ఆడటంలో ఆమె వెనుకబడిందని విమర్శించింది. ఆ తర్వాత రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్‌తో గతంలో హౌస్‌ను వీడిన మిథిలేష్ తిరిగి వచ్చి ముకేశ్‌ను నామినేట్ చేశాడు. రోహిత్‌తో డీల్ కుదుర్చుకోవడం, ఝాన్సీని సేవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ వర్షిణి కోసం ఆమెను పక్కన పెట్టడం వంటి అంశాలపై ముకేశ్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం దక్షి కూడా నీతూనే నామినేట్ చేసింది.
ఈ ఎపిసోడ్‌లో అపూర్వ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వర్షిణిని నామినేట్ చేసిన ఆమె, గత పది వారాలుగా హౌస్‌లో పెద్దగా పనులు చేయలేదని, ఫిజికల్ టాస్కులకు భయపడుతోందని విమర్శించింది. ఆమె ఉపయోగిస్తున్న భాషపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాదాపు పది నిమిషాల పాటు తన వాదనను వినిపించింది. ముకేశ్‌పై కూడా సెటైర్లు వేసింది. చివరగా హౌస్‌లోకి వచ్చిన ఝాన్సీ దేబ్జానీని నామినేట్ చేసింది. మాజీ కంటెస్టెంట్స్ చేసిన విమర్శలు, ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ప్రస్తుత సభ్యులు తమ ఆటతీరుపై ఆలోచనలో పడ్డారు. ఈ పరిణామాలు రాబోయే ఎపిసోడ్స్‌లో హౌస్‌లో మరిన్ని గొడవలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!