
రాజకీయాలు

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య తనకు అత్యంత ఇష్టమైన ఐదు సినిమాల గురించి వెల్లడించారు.
సూర్య ఎంపిక చేసిన ఫేవరెట్ సినిమాలు సేతు, ఈగ, లగాన్, కాఖా కాఖా, ధురంధర్. వీటిలో కేవలం రెండు మాత్రమే తమిళ సినిమాలు కాగా, మిగతావి ఇతర భాషలకు చెందినవి. మంచి కథ, వినూత్నమైన కథనం, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలంటే తనకు ప్రత్యేక అభిమానం అని సూర్య తెలిపారు. ముఖ్యంగా ఈ జాబితాలో తెలుగు చిత్రం ఈగ ఉండటం అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!