

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన "గుర్రం పాపిరెడ్డి" సినిమాను డార్క్ కామెడీ జానర్లో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించగా, ఈ చిత్రం డిసెంబర్ 19 న విడుదల కాబోతుంది. కొత్త తరహా కథతో రావాలనుకున్నందున ఈ కథను మొదటి ప్రొడక్షన్‌గా ఎంపిక చేశామని ప్రొడ్యూసర్స్ జయకాంత్ (బాబీ), అమర్ బురా తెలిపారు. నరేష్ అగస్త్య ఈ పాత్రకు పర్ఫెక్ట్గా సరిపోయాడని, ఫరియా అబ్దుల్లా నటనతో పాటు ఒక పాటను రాసి పాడి కొరియోగ్రాఫ్ చేయడం ప్రత్యేకత అని చెప్పారు. బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోసిగి ల మధ్య కామెడీ బాగా పని చేసిందని అన్నారు. పాత్రలకు సరిపోయే నటులను తీసుకోవడంతో బడ్జెట్ పెరిగినా, యూఎస్ నుంచి వేణు, డా.సంధ్యా గోలీ మద్దతు ఇవ్వడంతో ప్రొడక్షన్ సజావుగా పూర్తయ్యిందని తెలిపారు.
తెలివిలేని వాళ్లు తెలివైన వ్యక్తిని ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ కథ సారాంశమని ప్రొడ్యూసర్ అమర్ బురా చెప్పారు. సందేశాల కోసం కాదు, వినోదం కోసం థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకులను మా సినిమా ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నామని అన్నారు. స్ట్రైక్ కారణంగా షూటింగ్ మైసూర్లో కొనసాగించాల్సి రావడం, స్టార్ హీరో లేకపోవడం వల్ల బిజినెస్ పరంగా కాస్త కఠినతరమైందని చెప్పారు. అయినా కంటెంట్‌పై నమ్మకంతో 140 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. టికెట్ రేట్లు అందుబాటులో ఉంచి, రెస్పాన్స్ ఆధారంగా స్క్రీన్స్ పెంచుతామని చెప్పారు. అవతార్‌తో పాటు రిలీజ్ అవుతున్నప్పటికీ, మా సినిమాకు ప్రత్యేకమైన ఆడియెన్స్ ఉన్నారని, భవిష్యత్తులో కూడా ఇదే టీమ్‌తో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నామని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!