

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. తాజాగా చిత్ర బృందం రెండో పాట ‘మాలా’ను విడుదల చేసి ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించింది. వెంకటేష్ పొరుగింటి మహిళగా నటించిన నివేదా పేతురాజ్‌తో ఆయనకు మధ్య ఉండే రొమాంటిక్ కెమిస్ట్రీని ఈ పాటలో చూపించారు.
సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం శృంగార ఛాయలతో ఆకట్టుకోగా, తమన్ అందించిన ఉత్సాహభరితమైన సంగీతం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెంకటేష్ స్టైలిష్‌గా కనిపించగా, నివేదా పేతురాజ్ తన గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. సినిమా విడుదల తేదీపై చిత్ర బృందం త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేశ్, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!