

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్-2’. గతంలో వచ్చిన ‘జైలర్’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. రమ్యకృష్ణ, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, యోగిబాబు తదితరులు నటించారు. వీరితో పాటు ఏడేళ్ల బాలనటుడు రిత్విక్ కూడా తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో రజనీకాంత్ మనవడి పాత్రలో కనిపించిన రిత్విక్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు.
‘జైలర్-2’లో నటించినందుకు రిత్విక్‌కు ఎంత పారితోషికం లభించిందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం అతడికి సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తంపై చిత్రబృందం నుంచి అధికారిక ధ్రువీకరణ లేదు. రిత్విక్ గతంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’, నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ2’, కార్తీ నటించిన ‘సర్దార్’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించాడు. ఇప్పుడు ‘జైలర్-2’తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!