
రాజకీయాలు

కోలీవుడ్ స్టార్ సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘సూర్య 47’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కిస్తుండగా, నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇక మరోవైపు సూర్య తన తదుపరి చిత్రం ‘సూర్య 48’ కోసం ‘జై భీమ్’ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌తో మరోసారి చేతులు కలిపినట్లు టాక్ వినిపిస్తోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!