
గాసిప్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. సమాజ సేవలో నిమగ్నమైన తన ఓ వీరాభిమానిని ప్రత్యేకంగా అభినందించి, విలువైన బహుమతిని అందించి ప్రశంసలు అందుకున్నారు. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సేవ చేస్తున్న అభిమాని పట్ల రజనీకాంత్ తన అభిమానాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారు. మధురైకు చెందిన రజనీ శేఖర్ అనే వ్యక్తి రజనీకాంత్‌కు వీరాభిమాని. తన హోటల్లో పేదలకు కేవలం ఐదు రూపాయలకే పరోటా విక్రయిస్తూ సేవ చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్, శేఖర్‌ను అతని కుటుంబంతో కలిసి చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించారు. ఆయన చేస్తున్న సేవలను మనస్ఫూర్తిగా అభినందించిన సూపర్ స్టార్, ప్రోత్సాహకంగా బంగారు గొలుసును బహుమతిగా అందించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, రజనీకాంత్ సేవాభావాన్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!