
సినిమాలు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ 2025 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మించారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ విజయాన్ని మాత్రమే సాధించింది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను జూన్ 27న ప్రత్యేక రీ-రిలీజ్‌గా మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!