

2025 లో టాలీవుడ్ బాక్సాఫీస్ తీవ్ర డీలా పరిస్థితిని ఎదుర్కొంది. స్టార్ హీరోల సినిమాలు కూడా సరైన ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ కంటెంట్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోలకు ఉన్న మార్కెట్ ఇప్పుడు తగ్గిందని, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం హీరో ఇమేజ్‌తోనే హిట్ కొట్టడం చాలా కష్టమని విశ్లేషకులు అంటున్నారు. 2025 లో స్టార్ హీరోల సినిమాలు సరైన ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో విఫలమయ్యాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, వార్ 2, హరిహర వీరమల్లు, ఓజీ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కేవలం కటౌట్ సరిపోదు, బలమైన కంటెంట్ తప్పనిసరి అన్న విషయం ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.
హీరో ఏ రాష్ట్రానికి చెందినవారైనా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారైనా ఓటమి ఎదురైతే అది కెరీర్‌పై ప్రభావం చూపుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గ కంటెంట్ లేకపోతే సినిమా తొలి రోజే తేడా కొట్టేస్తుంది. కేవలం ఫ్యాన్స్ కోసం సినిమాలు తీయడం సరిపోదు, న్యూట్రల్ ఆడియన్స్‌ను కూడా థియేటర్లకు తీసుకురావాలి. దీనికి పవన్ కళ్యాణ్ సినిమాలే మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆయన నటించిన ఓజీ సినిమా రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులు సృష్టించగా, అంతకుముందు వచ్చిన హరిహర వీరమల్లు మాత్రం ఆశించిన ఓపెనింగ్స్ దక్కించుకోలేకపోయింది. ప్రేక్షకులకు స్టోరీ నచ్చకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కాబట్టి సినిమా రిలీజ్‌కు ముందు బజ్ క్రియేట్ చేయడంలో కంటెంట్‌దే కీలక పాత్ర అన్న విషయాన్ని దర్శక నిర్మాతలు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!