

సూపర్ స్టార్ మహేశ్ బాబు గ్లోబల్ సినిమాకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఘట్టమనేని కుటుంబం నుంచి ఇద్దరు యువ స్టార్స్ తెలుగు సినిమాకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. వారిలో ఒకరు ఘట్టమనేని జయకృష్ణ.
జయకృష్ణ హీరోగా ప్రతిభావంతుడైన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ రాబోతుందని ఇప్పటికే తెలిసింది. తాజాగా ఈ సినిమాకి స్టార్ సంగీత దర్శకుడు ఫైనల్ అయినట్టు అధికారిక అప్డేట్ వచ్చింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మరెవరో కాదు — జీ.వి. ప్రకాశ్ కుమార్.
తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న జీ.వి. ప్రకాశ్ ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ, లక్కీ భాస్కర్ వంటి సినిమాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. అతను ఈ క్రేజీ కాంబినేషన్‌కి జాయిన్ కావడంతో ప్రాజెక్ట్‌కు ఇంకా బలం చేకూరింది.
హీరోయిన్గా రాషా తాడని నటిస్తుండగా, ఈ సినిమాను జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. అలాగే సినిమా అశ్వనీదత్ సమర్పణలో రాబోతోంది.
ఈ సాలిడ్ టెక్నికల్ టీమ్‌తో జయకృష్ణ డెబ్యూట్ మూవీపై ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!