

నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలీల తల్లి స్వర్ణలత స్పందిస్తూ ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. అవి నిరాధారమైనవని, అసత్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీలీల తన చదువు, నటనపై పూర్తి దృష్టి పెట్టిందని, వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించే సమయం లేదని తెలిపారు. ఆమెకు వీలు దొరికినప్పుడల్లా నీట్-పీజీ పరీక్షకు సిద్ధమవుతోందని, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.
ఇటీవల తిరుమల సందర్శన, వాంఖడే టీ20 మ్యాచ్‌లో ఆమె కనిపించడం పూర్తిగా యాదృచ్ఛికమని, వాటి ఆధారంగా కథలు సృష్టించవద్దని స్వర్ణలత కోరారు. గతంలో బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీలకు సంబంధం ఉందన్న వార్తలను కూడా ఆమె ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ఇద్దరి తల్లులు గైనకాలజిస్టులుగా వృత్తిపరంగా కలుసుకుంటారని, దానిని తప్పుగా అర్థం చేసుకుని రూమర్లు సృష్టించారని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!